BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
'చావుపుట్టుకలు పడవలోనే, మాకు రెండో ప్రపంచం లేదు'.. శబరి నదిలో 11 కుటుంబాల జీవన ప్రయాణం
నది, ఇసుక దిబ్బలు, పడవలు...ఇవి తప్ప రెండో ప్రపంచమే తెలియని కొన్ని కుటుంబాలు చింతూరు వద్ద శబరి నదిపై జీవిస్తున్నాయి. వీరు దశాబ్దాల కిందట బతుకుతెరువు కోసం వందల కిలోమీటర్లు నదిలోనే ప్రయాణం చేసి చింతూరులోని శబరి నది ఒడ్డుకు చేరుకున్నారు.
చైనా: రికార్డు స్థాయిలో తగ్గిన జననాల రేటు
మూడేళ్ల కంటే తక్కువ వయసు గల చిన్నారుల తల్లిదండ్రులకు చైనా ప్రభుత్వం 3,600 యువాన్లు(సుమారు రూ. 46,000) ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తోంది. కొన్ని ప్రావిన్సులు అదనపు నగదు ప్రోత్సాహకాలు, ఎక్కువ ప్రసూతి సెలవులు కూడా ఇస్తున్నాయి.
బీజేపీకి 2024-25లో భారీగా విరాళాలు ఇచ్చినవారిలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ మహిళ
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు బీజేపీ సమర్పించిన కంట్రిబ్యూషన్ రిపోర్టు ఆధారంగా ఈ విశ్లేషణ చేసింది బీబీసీ. ఈ రిపోర్టులో రూ.20,000కు పైగా విరాళాలను ఆ పార్టీకి అందజేసిన వారి వివరాలు ఉంటాయి.
గాజా ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరాలని మోదీకి ట్రంప్ ప్రభుత్వ ఆహ్వానం, సభ్యత్వానికి ఎన్నివేల కోట్లు కట్టాలంటే..
ఈ బోర్డు డోనల్డ్ ట్రంప్ గాజా శాంతి ప్రణాళికలో భాగం. కానీ బోర్డు చార్టర్లో గాజా గురించి ప్రస్తావించలేదని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
చెరకు తింటే రక్తంలో చక్కెర లెవెల్స్ పెరుగుతాయా? 4 సందేహాలు, సమాధానాలు
''సాధారణంగా ఒక వ్యక్తి దంతాలు సుమారు 16 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో చాలా బలంగా ఉంటాయి. ఆ తర్వాత వాటి బలం ఆ వ్యక్తి తీసుకునే సంరక్షణపైనే ఆధారపడి ఉంటుంది. మన దంతాల బలాన్నిబట్టి చెరకు గడలను కొరకాలి. బలహీనమైన పళ్లతో చెరకు గడలను కొరికితే, పళ్లు ఊడిపోయే ప్రమాదం ఎక్కువ'' అని బీబీసీకి డెంటిస్ట్ బాలచందర్ వివరించారు.
షార్క్ బీచ్: ఈతకు వెళ్లిన ఓ పిల్లాడిని సొరచేప పట్టేసింది..
‘‘వాళ్లు అతని ప్రాణాలను కాపాడ్డానికి ఎంత చేయాలో అంత చేశారు" అంటూ న్యూ సౌత్‌వేల్స్ ప్రీమియర్ ఆ పిల్లలను పొగిడారు.
అమెరికా: ఇరాన్ బలం చూసి దాడికి వెనక్కి తగ్గుతోందా?
సైనిక బలగాలు, ఆయుధాలు, బడ్జెట్లను పోల్చినప్పుడు ఇరాన్ ఏమాత్రం అమెరికాకు సరితూగదు. కానీ, ఇరాన్ పై దాడి చేయాలంటే అమెరికాయే కాదు, ఏదేశమైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. ఎందుకిలా జరుగుతుంది? ఈ కథనంలో తెలుసుకోండి.
చైనా భారీగా బంగారం ఎందుకు కొంటోంది?
బంగారం నిల్వలు పెరగడం వల్ల కేంద్ర బ్యాంకులు అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటాయని చైనా విశ్లేషకులు అంటున్నారు. డాలర్ బలహీనపడితే, విదేశీ మారక నిల్వలను స్థిరీకరించడంలో బంగారం సహాయపడుతుందన్నారు. ఇంతకీ చైనా ఎప్పటి నుంచి బంగారం కొంటోంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావమేంటి?
మైనర్ నిందితులకు 'రెండో అవకాశం' లేకుండా పోతోందా?
ఎట్టకేలకు, 2024లో పూజ(పేరు మార్చాం) కేసు జేజేబీకి బదిలీ అయింది. నేరారోపణలు ఎదుర్కొన్న సమయంలో పూజ మైనర్ అని జేజేబీ తేల్చింది. జువైనల్స్‌కు గరిష్ట జైలు శిక్ష మూడేళ్లు మాత్రమే. కానీ, పూజ అప్పటికే ఆరేళ్ల జైలు శిక్ష పూర్తి చేసింది. ఎందుకిలా? లోపమెక్కడ?
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఫీచర్లు
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
రహమాన్ డకైత్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
భూతకోల: ఏమిటీ ఆచారం, బయటి ప్రాంతాలలో దీనిని ప్రదర్శించకూడదా?
బయటివారికి ఇదొక వేషంలా కనిపిస్తుంది కానీ, తుళు ప్రజలకు మాత్రం ఆ రూపం దైవం. అందుకే బయట ప్రాంతాల్లో దీన్ని ప్రదర్శించడానికి వారు ఇష్టపడరు. వేషంగా వేసుకుంటే సహించరు. భక్తితో పాటు భయం ఉంచడం కూడా లక్ష్యం అంటారు.
తెలుగుప్రజలు అరుణాచలానికి ఎక్కువగా ఎందుకు వెళతారు?
18వ శతాబ్దం నాటికే అరుణాచలం దగ్గర తెలుగు శాసనాలు కనిపించాయి. ప్రస్తుత అరుణాచల గోపుర నిర్మాణం ప్రారంభించింది శ్రీకృష్ణదేవరాయలు అయితే, దాన్ని పూర్తి చేసింది తంజావూరు తెలుగు పాలకుడు సేవప్ప నాయకుడు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































